టాక్సిక్ ప్రమోషన్స్ లో ఆమె కనిపిస్తుందా?

Toxic - Nayanthara


యశ్ టాక్సిక్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆగష్టు 26 న విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా ఫిలిం ట్రైలర్ ఆగష్టు 8 న బెంగుళూరు వేదికగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో యష్ తో పాటుగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో కనిపించనుంది.

కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమ ఖురేషి, తార సుతారియా ఇలా చాలామంది హీరోయిన్స్ టాక్సిక్ లో భాగమయ్యారు. అయితే నయనతార మాములుగా సినిమా ప్రమోషన్స్ కు రాదు. మేకర్స్ ఎంతగా అడిగినా ఆమె తన పంథా మార్చుకోదు. టాక్సిక్ పాన్ ఇండియా ఫిలిం. మరి నయనతార టాక్సిక్ ప్రమోషన్స్ లో ఏమైనా కనిపిస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

నయనతార బెంగుళూరులో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిస్తుందా, అలాగే టాక్సిక్ ఇంటర్వూస్ లో కనిపిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. మరి హాలీవుడ్ రేంజ్ లో విడుదలవుతున్న టాక్సిక్ చిత్ర ప్రమోషన్స్ లో నయన్ కనిపిస్తే సినిమాకి  అవుతుంది. 

Actress Nayanthara