సీత గా సాయి పల్లవి కి 100 కి 100

Ramayana: Sai Pallavi as Sita


బాలీవుడ్ లో రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ మొదటి పార్ట్ ఈ దీపావళికి విడుదలవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు రామాయణ ట్రైలర్ వదిలారు మేకర్స్. ఢిల్లీ వేదికగా 3D ట్రైలర్ వదిలిన మేకర్స్.. ఈరోజు యూట్యూబ్ లో ట్రైలర్ రిలీజ్ చేసారు. రామాయణ ట్రైలర్ విజువల్ వండర్ అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.

కన్నడ హీరో యశ్ రావణ్ గా లుక్స్ పరంగా పెరఫార్మెన్స్ పరంగా చాలాబాగా చేసాడు అని, సీత గా సాయి పల్లవి అదిరిపోయింది అంటూ సౌత్ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. సాయి పల్లవి సీత గా అద్భుతంగా ఉంది, నేచురల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ తో అద్దరగొట్టేసింది అంటూ సాయి పల్లవి ని పొగిడేస్తున్నారు.

సీత కేరెక్టర్ లో సాయి పల్లవి కి 100 కి 100 మార్కులు వెయ్యాల్సిందే అంటూ సౌత్ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ లో సీత కేరెక్టర్ కి సాయి పల్లవి ని ఎందుకు తీసుకున్నారంటూ కొంతమంది చెత్త కామెంట్లు చేసినలో సౌత్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. గ్లామర్ గర్ల్స్ సీత కేరెక్టర్ చెయ్యడం కన్నా సాయి పల్లవి 100 రేట్లు బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Ramayana-Sai Pallavi