మెల్లగా రాజకీయాలవైపు అడుగులు

Allu Arjun gesture wins hearts

 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారం చేపట్టి తమిళనాడు సీఎం గా బాధ్యతలు నిర్వర్తించడం చాలామంది హీరోలను ఇన్స్పైర్ చేసింది. ఇప్పటికే కోలీవుడ్ హీరోలు పొలిటికల్ ఎంట్రీ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.. కానీ బయటపడడం లేదు. టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న అల్లు అర్జున్ అడుగులు కూడా ఆ వేలోనే కనిపిస్తున్నాయి.


అభిమానులతో కీలక మీటింగ్స్, వారిని ఉత్తేజపరుస్తూ స్పీచ్ లు ఇవ్వడాలు, సమయం ఉన్నప్పుడల్లా వారిని కలుస్తాను అని చెప్పాడాలు, ఆంధ్ర దగ్గర నుంచి కేరళ వరకు అభిమాన సంఘాలతో అల్లు అర్జున్ మమేకమవడం, నిన్న హైదరాబాద్ లో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ అన్ని ఆయన్ను రాజకీయాలవైపు నడిపించేలా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మెగా నుంచి అల్లు గా పూర్తి స్థాయిలో మారి విశేష అభిమాన గణాన్ని మైంటైన్ చేస్తున్న అల్లు అర్జున్ ఇలా ప్రత్యేకంగా అభిమానులను కలవడం మాత్రం చాలామందికి నచ్చేసింది. అల్లు అర్జున్ ఈ విషయంలో చాల స్పెషల్ అంటున్నారు. ప్రస్తుతం అట్లీ తో రాకా, తర్వాత లోకేష్ కనగరాజ్ తో మరో మూవీకి అల్లు అర్జున్ కమిట్ అయ్యారు.

Allu Arjun met hundreds of fans during a special Allu Arjun Fans Association