లెనిన్ సెన్సార్ టాక్

Lenin Censor Talk

 

అక్కినేని అఖిల్ మూడేళ్ల తర్వాత లెనిన్ తో మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అక్కినేని అభిమానుల్లో లెనిన్ పై భారీ అంచనాలు, సోషల్ మీడియాలో లెనిన్ పై విపరీతమైన హైప్ నడుస్తున్నాయి. అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా అఖిల్ లెనిన్ తో మంచి హిట్ కొట్టాలని కోరుకోవడం విశేషం.

ఇక రేపు విడుదలకాబోయే లెనిన్ చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. లెనిన్ సెన్సార్ టాక్ లోకి వెళితే సినిమా చక్కని నిడివితో, బోర్ కొట్టకుండా కథ ఎక్కడా పక్కకు పోకుండా సాగుతుంది, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది..

అఖిల్ భాగ్యశ్రీ బోర్సే నడుమ వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్, BGM లెనిన్ చిత్రానికి మెయిన్ హైలెట్స్ గా నిలబోతున్నాయని సెన్సార్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్. మరి ఎన్నో ఏళ్లుగా అఖిల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. లెనిన్ తో ఈసారి మనోడు గట్టిగా కొట్టేలా కనిపిస్తుంది ఈ సెన్సార్ టాక్ చూస్తుంటే..! 

Lenin Movie Censor Talk