ప్రభాస్ లైనప్ పై ఫుల్ క్లారిటీ

Clarity on Prabhas's lineupClarity on Prabhas's lineup

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో విపరీతమైన బిజీ షెడ్యూల్స్ ని మైంటైన్ చేస్తున్నారు. మరో నెలలో మరో ప్రాజెక్ట్ మీదకి ప్రభాస్ వెళ్లాల్సి ఉంది. అంటే ఏక కాలంలో ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్స్ చెయ్యాల్సి ఉంది. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా సమ్మర్ లో ప్రభాస్ చాలా కష్టపడుతూ షూటింగ్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, అలాగే హను రాఘవపూడి ఫౌజీ చిత్రాల సెట్స్ లో ప్రభాస్ బిజీగా వున్నారు. ఆగష్టు నుంచి కల్కి 2 కి సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంది. ఇంత బిజీగా వున్న ప్రభాస్ ఆ డైరెక్టర్ తో సినిమా ని ఓకే చేసారు, ఈ డైరెక్టర్ తో సినిమాని ఓకే చేసారు, ముఖ్యంగా ధురంధర్ తో సెన్సేషన్ సృష్టించిన ఆదిత్య ధర్ తో ప్రభాస్ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయ్యింది అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ప్రభాస్ లైనప్ పై వస్తున్న రూమర్స్ పై ఆయన టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాలేవీ అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అసలు ఆయన ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా లేదు, ప్రస్తుతం ఆయన చాలా బిజీగా వున్నారు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన ఇతర ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పి ఒత్తిడికి గురయ్యే ఉద్దేశ్యం లేదు. సో ప్రభాస్ సినిమాల లైనప్ పై వస్తున్న రూమర్స్ ని నమ్మొద్దు అంటూ ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ లైనప్ పుకార్లకు చెక్ పడింది. 

Prabhas puts rumors to rest, prioritizes existing film lineup