వారణాసి: శ్రీ రాముడిగా మహేష్ లుక్ లీక్
Varanasi: Mahesh's look as Lord Rama leaked
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం పై ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే వారణాసి చిత్రం తండ్రి కొడుకుల బాండింగ్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతుంది, మరో 80 రోజుల పాటు చిత్రీకరిస్తే వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుంది అంటూ రాజమౌళి హైప్ క్రియేట్ చేసారు.
ఈ చిత్రంలో మహేష్ రాముడిగా, రుద్రా గా రెండు వెరిషియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. తాజాగా వారణాసి షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫోటో లీకై నెట్టింట్లో సంచలనంగా మారింది. రాముడి కేరెక్టర్ లో కాషాయ వస్త్రాలు, చేతిలో విల్లుతో మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే వారణాసి నుంచి లీకైన ఫొటో ఒరిజినలా లేదా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన AI ఇమేజ్ అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఈ లీకైన ఫోటో అంతగా వైరల్ అవ్వడానికి రామాయణానికి సంబంధించిన 20 నుంచి 30 నిమిషాల కీలక ఘట్టం ఉండనుందని, ఇందులో మహేష్ బాబు శ్రీ రాముడిగా కనిపిస్తారని రాజమౌళి రివీల్ చెయ్యడంతో చేకూరింది.








































