Advertisement

రావు బహదూర్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Rao Bahadur Overseas Talk


సత్యదేవ్ రావు బహదూర్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న చిత్రం. వెంకటేష్ మహా డైరెక్షన్, సత్యదేవ్ రావు బహదూర్ ప్రమోషన్స్, సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ప్రసంశలు కురిపించడం అన్ని రావు బహదూర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి.

ఈరోజు జులై 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రావు బహదూర్ ఓవర్సీస్ షోస్ పూర్తయ్యాయి. మేకర్స్ ఎందుకో రావు బహదూర్ ప్రీమియర్స్ వైపు వెళ్ళలేదు. ఇక ఓవర్సీస్ లో సినిమాని వీక్షించిన వారు రావు బహదూర్ పై సోషల్ మీడియా లో రియాక్ట్ అవుతున్నారు. సినిమా మొదలవడమే కాస్త స్లో గా మొదలై పాత్రల్లో ప్రేక్షకుడు లీనమయ్యేందుకు సమయం తీసుకున్నా.. సెకండ్ హాఫ్ ను దర్శకుడు వెంకటేష్ మహా నడిపించిన తీరుకు ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు.

సత్యదేవ్ అద్భుతమైన నటన, ఆ పాత్రలో ఆయన చూపించిన వైవిధ్యమైన హావభావాలు, నటనలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి, కామెడీ, సెకండ్ హాఫ్,  క్లైమాక్స్ ట్విస్ట్ రావు బహదూర్ కు ప్రధాన బలాలు. సినిమా ఫస్టాఫ్, పాత్రల పరిచయం, కమర్షియల్ సినిమా కాకపోవడం ప్రేక్షకుడ్ని కాస్త అసంతృప్తికి గురి చేస్తాయి.

ఓవరాల్ గా చూసుకుంటే రావు బహదూర్ రెగ్యులర్ ఫార్మేట్ లో కాకుండా ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్న మాట.

Rao Bahadur Overseas Public Talk