నాగబంధం ప్రీమియర్స్ టాక్

Nagabandham Premiers TalkNagabandham Premiers Talk

 


ఈమధ్య కాలంలో VFX వర్క్ గురించి అంతగా మట్లాడుకున్నది అభిషేక్ నామ తెరకెక్కించిన నాగబంధం గురించే. కళ్ళు చెదిరే సెట్ల నిర్మాణం, దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టడమే కాదు నాగబంధం ప్రమోషన్స్ తో పాన్ ఇండియా లో అందరి చూపు నాగబంధం పై పడేలా  చేసారు. టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు స్పెషల్ గా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకునేలా వాటిని కట్ చేసారు.

మంచి అంచనాల నడుమ ఈరోజు జులై 3 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగబంధం చిత్ర మేకర్స్ గత రాత్రి హైదరాబాద్ అల్లు సినిమాస్ లో ప్రెస్ కి స్పెషల్ ప్రీమియర్ వేశారు. నాగబంధం వీక్షించిన వారు తమ స్పందనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

సినిమా మొదలవడమే ఆడియన్స్ కథలో లీనమయ్యేలా చేసారు. ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ హాఫ్ నిడివి కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్ లోను సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు పరీక్ష పెడతాయి. హీరోయిన్ నాభ నటేష్ అందం, ఆమె నటన ఆకట్టుకున్నాయి.

నాగబంధానికి సినిమాటోగ్రఫీ హైలెట్, సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకున్నాయి. విజువల్స్, నటీనటులు ప్లస్ కాగా.. కొత్తదనం లేని కథ, స్క్రీన్ ప్లే, నిడివి, ఎమోషన్స్ లేకపోవడం నాగబంధం చిత్రానికి ప్రధాన మైనస్ లు గా చెప్పుకోవచ్చు.

Nagabandham Public Talk