ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ramayana movie clip Leaked Here Is the Truth

రామాయణం లీక్ కలకలం.. అసలు నిజం ఇదే

Ramayana movie clip Leaked Here Is the TruthRamayana movie clip Leaked Here Is the Truth

 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `రామాయణ: పార్ట్ 1` చిత్రం నుండి ఒక కీలకమైన యుద్ధ సన్నివేశం లీక్ అయిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో చ‌ర్చ‌ ఊపేస్తోంది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వివాదాస్పద వీడియో క్లిప్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి గెటప్‌లో శత్రుసంహారం చేస్తూ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. అయితే సినిమా ట్రైలర్ నుండే ఈ విజువల్స్ లీక్ అయ్యాయని కొందరు గట్టిగా వాదిస్తుంటే... ఇండస్ట్రీ టెక్నీషియన్స్ మాత్రం ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాయాజాలమని... కావాలనే ఎవరో ఏఐ టూల్స్ ఉపయోగించి ఈ తరహా ఫేక్ లీక్‌ను సృష్టించారని కొట్టిపారేస్తున్నారు.

ఈ లీక్ వివాదానికి తోడు.. సినిమా సెట్స్‌ను సందర్శించిన ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత పీక్స్‌కు చేర్చాయి. లీకైన విజువల్స్ పక్కన పెడితే... మేకర్స్ డిజైన్ చేసిన అసలైన గ్రాఫిక్స్ హాలీవుడ్ చిత్రం `అవతార్` రేంజ్‌లో ఉన్నాయని... ఇంటర్నెట్‌లో ఉచిత పబ్లిసిటీ కోసమే మొదట్లో కొద్దిగా క్వాలిటీ లేని ఫుటేజ్‌ను వదిలారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి... ఆ తర్వాత మాట మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 3,900 కోట్ల భారీ బడ్జెట్‌తో నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ సినిమాలోని ఈ లీక్ వ్యవహారంపై చిత్ర‌బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. ఈ ఏడాది దీపావళి రేస్‌లో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
 

Ramayana movie clip Leaked online