Advertisement

సూపర్ స్టార్ vs మెగాస్టార్

Super Star vs Mega Star

 

సూపర్ స్టార్ రజినీకాంత్ vs మెగాస్టార్ చిరంజీవి మద్యన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ దసరా బరిలో రజినీకాంత్ జైలర్ 2, చిరంజీవి విశ్వంభర చిత్రాలు నిలుస్తున్నాయి. జైలర్ 2 షూటింగ్ పూర్తి కావడమే కాదు అక్టోబర్ 15 న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

మరోపక్క ఎన్నాళ్ళుగానో విడుదలకు నోచుకోని మెగాస్టార్ చిరు విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16 న విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ అక్టోబర్ దసరా బరి చాలా హాట్ గా మారిపోతుంది. జైలర్ కి సీక్వెల్ గా భారీ అంచనాలతో జైలర్ 2 తెరకెక్కుతుంది. చిరు విశ్వంభర విజువల్ వండర్ లా తెరకెక్కింది.

ఈ దసరా బరిలో చిరు vs రజిని, విశ్వంభర vs జైలర్ 2. ఏ సినిమాకి వెయిట్ ఎక్కువ ఉందొ అందరికి అర్ధమవుతున్నా ఈ రసవత్తర పోటీ పై మాత్రం ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యింది అనడంలో సందేహమే లేదు.

Jailer 2 vs Vishwambhara