రిషబ్ శెట్టి-రానా జై హనుమాన్ అప్ డేట్

Jai Hanuman Shooting updateJai Hanuman Shooting update


హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ ప్రశాంత్ వర్మ ఎన్నో ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ చేసినా.. ముందుగా కాంతార హీరో రిషబ్ శెట్టితో తో అనౌన్స్ చేసిన జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి జై హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం రిషబ్ శెట్టి భారీ కాదు కాదు కళ్ళు చెదిరే పారితోషికం అందుకోబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.

ఇక తాజాగా జై హనుమాన్ ఫస్ట్ షెడ్యూల్ ని ప్రశాంత్ వర్మ పూర్తి చేశారు. ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్న రానా, రిషబ్ శెట్టి ల నడుమ 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. జై హనుమాన్ లో రానా లుక్ ఆడియన్స్ ని ఫుల్ గాఇంప్రెస్స్ చేస్తుంది అంటూ యూనిట్ వర్గాలు చెబుతున్నారు.

ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్రశాంత్ వర్మ షూటింగ్ ని స్టార్ట్ చేసారు. 

Jai Hanuman update