ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Controversy Around NTR-Trivikram Announcement

ఎన్టీఆర్ - త్రివిక్రం మూవీపై తమిళ అభ్యంతరాలు

Controversy Around NTR-Trivikram Announcement


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ఏడాది సమయం ఉండగానే ఎన్నాళ్లగానో ప్రచారంలో ఉన్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో గాడ్ ఆఫ్ వార్ చిత్రం అనౌన్సమెంట్ ఇచ్చారు నిర్మాతలు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మైథలాజికల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రీ లుక్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేసారు.

ఈ గాడ్ ఆఫ్ వార్ పై వచ్చిన క్లారిటీ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. కానీ తమిళ తంబీలు మాత్రం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై గుర్రుగా ఉన్నారు. సుబ్రమణ్యేశ్వర స్వామి రిఫరెన్స్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా స్పష్టత ఇచ్చేసారు.

అయితే తమిళులకు ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పై త్రివిక్రమ్ సినిమా ప్లాన్  చేసారు. అది వాళ్ళు సంతోషించాలి, కానీ త్రివిక్రమ్ - ఎన్టీఆర్ అనౌన్సమెంట్ పై వారు మండిపడుతున్నారు. కారణం ఆ ప్రీ లుక్ పోస్టర్ లో సంస్కృత శ్లోకం పెట్టార‌ని, ఆ శ్లోకం కోసం త‌మిళం తీసుకోలేదు అంటూ తమిళ తంబీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వెల‌సింది త‌మిళ‌నాడులో అని, చ‌రిత్ర‌ను మార్చొద్దని, ఒక సినిమా కోసం చరిత్ర మార్చి మాట్లాడినా, లేదంటే చిత్రీకరించినా ఊరుకోమని, ఈ చిత్రాన్ని బహిష్కరిస్తామని నిర్మాత నాగవంశీకి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

Mythological Epic God Of War Announcement Triggers Online Debate