స్టార్స్ లేరు కానీ ఇంట్రెస్టింగ్ ఫైట్

Rao Bahadur vs NagabandhamRao Bahadur vs Nagabandham


ఈ వారం స్టార్ హీరోలు బాక్సాఫీసు దగ్గర వార్ కి దిగకపోయినా.. ఈ శుక్రవారం బాక్సాఫీసు ఫైట్ మాత్రం క్రేజీగా కనిపిస్తుంది. ఈ వారం సత్యదేవ్ రావు బహదూర్, అభిషేక్ నామా నాగబంధం చిత్రాలు విడుదలవుతున్నాయి.

సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన రావు బహదూర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడం ఈ సినిమాపై క్రేజ్ ని పెంచడమే కాదు.. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సత్యదేవ్ చాలా కష్టపడుతూ ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. సత్యదేవ్ ప్రమోషన్స్, మహేష్ రివ్యూస్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

మరోపక్క ఎలాంటి నోటెడ్ స్టార్స్ లేకపోయినా డివోషనల్ గా అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన నాగబంధం చిత్రాన్ని అంతే డివోషనల్ గా టెంపుల్ సెట్స్ వేసి మరీ ప్రమోట్ చేసున్నారు. భారీ విజువల్ వండర్ గా నాగబంధం ఉండబోతుంది అని ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో చూపించారు.

అనంత పద్మనాభస్వామి టెంపుల్ నేథ్యంలో రాసుకున్న ఫాంటసీ కథ నాగబంధం. అటు బిజినెస్ పరంగాను నాగబంధం సేఫ్ జోన్ లోనే కనిపిస్తుంది. అంతలా అభిషేక్ నామా నాగబంధం పై అంచనాలు పెంచేశారు. సో ఈ వారం స్టార్స్ లేకపోయినా బాక్సాఫీసు దగ్గర క్రేజీ ఫైట్ చూడబోతున్నామన్నమాట.

Interesting fight - Rao Bahadur vs Nagabandham