సడన్ గా వార్తల్లోకి ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్

God Of War Update Tomorrow?God Of War Update Tomorrow?



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ లో విడుదల కాబోతుంది. మరోపక్క ఎన్టీఆర్-కొరటాల దేవర 2 ఆగిపోయింది అనే వార్తలు ఉన్నాయి. ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉంది.

కానీ ఈ చిత్రం పై ఎక్కడా అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు. త్రివిక్రమ్ వెంకీ తో ఆదర్శ కుటుంబం చేస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల. అయితే నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో చాలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో గాస్ ఆఫ్ వార్ పై అప్ డేట్ వస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు.

కానీ సడన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ నాగ వంశీ చేసిన ఒక్క పోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసింది. రేపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఉంటుందని ఆయన అధికారికంగా హింట్ ఇచ్చారు. సో రేపు సోమవారం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో గాడ్ ఆఫ్ వార్ అఫీషియల్ ప్రకటన రాబోతుందన్నమాట.
 

NTR as God of War on Cards?