సిల్లీ రీజన్ తో కేతన్ ని హత్య చేసిన సియా
Siya Goyal Killed Fiance Over His Hair Loss, Wig Use?
కేతన్ అగర్వాల్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ లో కాలు జారి లోయలో కేతన్ అగర్వాల్ పడిపోయాడంటూ కాబోయే భార్య సియా గోయల్ కథలు అల్లి పోలీసులను తప్పు దారి పట్టించి ఏమి ఎరుగని దానిలా బిల్డప్ ఇచ్చిన విషయము తెలిసిందే. కానీ సియా గోయల్ కాబోయే భర్త కేతన్ ను హత్య చేసిన కేసులో జైలులో ఊచలు లెక్కబెడుతుంది.
తన ప్రియుడు చేతన్ తో కలిసి కేతన్ ను గుట్టు చప్పుడు కాకుండా హత్య చేసి తప్పించుకుందామనుకున్న సియా గోయల్ కి ఈ హత్య కేసు జైలు పాలయ్యేలా చేసింది. అయితే కేతన్ బయటి వాడు కాదు సియా ఫ్యామిలీకి బాగా తెలిసిన కుటుంబ సభ్యుడు. కేతన్ ఫ్యామిలీ, సియా ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్.
అలాంటి అబ్బాయిని సియా గోయల్ అంత కర్కశంగా ఎలా చంపింది అనేది నిన్నటివరకు అంతుబట్టని ప్రశ్నే. కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కష్టడీలో ఉన్న సియా గోయల్ అసలు కేతన్ ను ఎందుకు చంపారు అని పోలీసులు అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు.
సియా గోయల్ కేతన్ ని చంపడానికి కారణం అతనికి బట్టతల ఉంది, విగ్ పెట్టుకుని తిరుగుతాడు, నత్తి ఉంది అందుకే అతను నచ్చలేదు అని చెప్పగా అది పేరెంట్స్ కి చెబితే సరిపోతుంది దానికి చంపెయ్యలా అని పోలీసులు అడిగితె పేరెంట్స్ కి చెప్పడం కన్నా కేతన్ ను చంపడమే ఈజీ అనిపించింది అని సియా గోయల్ చెప్పిన మాటలు పోలీసులను విస్మయానికి గురి చేసిందని తెలుస్తుంది.
కేతన్ అగర్వాల్ ని చంపేందుకు సియా గోయల్ ప్రియుడు చేతన్ తో కలిసి పలుమార్లు స్కెచ్ వేసి చివరికి లోయలో తోసేసి చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు.







































