ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Exciting details about Maa Inti Bangaram sequel

సీక్వెల్ ట్రెండ్ ని ఫాలో అవుతున్న సమంత

Exciting details about Maa Inti Bangaram sequel


సీక్వెల్స్ ట్రెండ్ ని హీరోలే కాదు ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. బాహుబలి తో సీక్వెల్ ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి ఆ ఫార్ములా వదిలేసి ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. కానీ రాజమౌళి సీక్వెల్ ట్రెండ్ ని చాలామంది దర్శకులు, హీరోలు ఫాలో అవుతున్నారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని షెడ్డుకెళ్ళిపోతున్నాయి.

ఇప్పుడు సమంత కూడా మా ఇంటి బంగారం చిత్రం సక్సెస్ అవడంతో దానికి సీక్వెల్ ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 న ప్రేక్షకులు ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంతో సమంత నటిగా, నిర్మాతగా లాభం పొందింది.

అందుకే వైజాగ్ లో జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో సీక్వెల్ ప్రకటించింది సమంత. ట్రాలాల బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు కథ తో మా ఇంటి బంగారం సీక్వెల్ సమంత మెటర్నిటీ లీవ్ తర్వాత పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. 

Maa Inti Bangaram sequel Announced