భార్యలతో సీనియర్ హీరోలు గోవాలో
Chiru, Nag, Venky Attend Kushboo Daughter Wedding i
గోవాలో కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కుమార్తె వివాహం గత రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఖుష్బూ, సుందర్ సి ల కుమార్తె పెళ్ళిలో పలువురు సెలబ్రిటీస్ సందడి చేసారు. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు తమ తమ భార్యలతో కలిసి పాల్గొన్నారు.
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు వెళ్లిన చిరు, వెంకీలు భార్యలతో కలిసి క్రీమిష్ పంచె కట్టు డ్రెస్ కోడ్ లో కనిపించగా, నాగ్, అమల మాత్రం సపరేట్ డ్రెస్ కోడ్ లో కనిపించారు. చిరు, వెంకీ, నాగ్ ముగ్గురు కుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో హైలెట్ అయ్యారు. ఇంకా ఈ పెళ్ళికి నటి త్రిష ఇలా పలువురు కోలీవుడ్ సెలెబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
చిరు, వెంకీ, నాగ్ లు సరదాగా భార్యలతో కలిసి కనిపించిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi, Nagarjuna, Venkatesh Attend Kushboo Daughter Wedding in Goa







































