పెద్ద సినిమాకి ఇన్ని కష్టాలా?
Vishwambhara Facing Hurdles
విశ్వంభర చిన్న సినిమా ఏమి కాదు. మెగాస్టార్ చిరు హీరో. దర్శకుడు వసిష్ఠ భారీ బడ్జెట్ ఎక్కించిన సినిమా. అయినప్పటికి ఈ సినిమా విడుదలకు రాకపోవడమే పలువురిలో పలు అనుమానాలు రేకెత్తేలా చేస్తుంది. దర్శకుడు వసిష్ఠ సీజీ వర్క్ లేట్ అంటున్నా మరో పక్క విశ్వంభరకు బడ్జెట్ కష్టాలు అనే మాట కూడా వినిపిస్తుంది.
ఏడాదిన్నరగా సీజీ వర్క్ కోసం సమయం కేటాయించడం విడ్డురమే. మరోపక్క సీజీ వర్క్ కి బడ్జెట్ తడిచి మోపెడు అవడంతో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు. అసలు విశ్వంభరకు సీజీ వర్క్ ఎంత కాలం పడుతుంది. కొద్దిరోజుల క్రితం సీజీ వర్క్ చివరి దశకు చేరుకుంది, ఇక విడుదల తేదీ వస్తుంది అన్నారు.
కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. మెగాస్టార్ చిరు వరప్రసాద్ సక్సెస్ మోడ్ లో విశ్వంభర జూన్ కానీ జులై కానీ రిలీజ్ ఉండచ్చు అన్నారు. అయినా ఇప్పటికి విశ్వంభర జాడ లేదు. పెద్ద సినిమాకి ఇన్ని కష్టాలా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.







































