పెళ్లి చేసుకున్నాడు-హాస్పిటల్ పాలయ్యాడు
What Happened To Shanmukh?
యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రెండు రోజుల క్రితమే వైష్ణవి అనే అమ్మాయిని తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల నడుమ షణ్ముఖ్-వైష్ణవి ల వివాహం గ్రాండ్ గా జరిగింది.
పెళ్లి జరిగిన మూడోరోజు షణ్ముఖ్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అయ్యో పెళ్లయ్యింది- అంతలోనే ఆసుపత్రి పాలయ్యాడు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలు షణ్ముఖ్ కి ఏమైంది, ఎందుకిలా ఆసుపత్రి పాలయ్యాడు. పెళ్లి వలన ప్రయాణాలతో ఇబ్బందిపడి హాస్పిటల్ కి వెళ్లాడా, లేదంటే మారేదన్నా సమస్యనా అని ఆయన అభిమానులు భయపడుతున్నారు.
ఇక షణ్ముఖ్ యూట్యూబర్ గా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ లోకి వెళ్లిన షణ్ముఖ్ ని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఆయన లవర్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఆతర్వాత కొన్నాళ్ళకు వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమించి షణ్ముఖ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.







































