ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actor Vishnu Vishal shares a heartfelt note

అలాంటి వ్యాధితో బాధపడుతున్న కోలీవుడ్ హీరో

Actor Vishnu Vishal shares a heartfelt note



కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ త్వరలోనే మట్టి కుస్తీ 2 తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం విష్ణు విశాల్ గట్ట కుస్తీ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఐతే విష్ణు విశాల్ కొద్దిరోజులుగా ఏదో అనారోగ్య సమస్యతో బాధడుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా తనపై జరుగుతున్న ప్రచారానికి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విష్ణు విశాల్ తనకు ఉన్న వ్యాధి వివరాలను బయటపెట్టారు.

అందరికీ హాయ్.. మీరు నా ఆరోగ్యంపై చూపిస్తున్న ప్రేమ, శ్రద్ద కు ఫిదా అవుతున్నాను, అందరికి ధన్యవాదాలు. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. కొన్నాళ్లుగా నా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించారు. కారణం నేను గత మూడు, నాలుగేళ్లుగా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. ట్రీట్మెంట్ లో భాగంగా డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు.

ఆ మెడిసిన్ వల్లే నేను ఇలా అయ్యాను. ఈ మందులు తీసుకుంటున్నప్పుడు కడుపు ఉబ్బరంతో పాటు శరీరంలో కొన్ని మార్పులు కలుగుతున్నాయి. హెల్త్ ఇంపార్టెంట్, అందుకే ఈ చికిత్స చాలా అసవరం. ఈ కష్టమైన సమయంలో మీ ప్రేమ, అభిమానం నన్నుముందుకు నడిపిస్తున్నాయి.

గట్ట కుస్తీ 2 కోసం అలుపెరగని పని చేసిన అందరి కోసం నాకున్న బాధ్యతను నిర్వర్తించాలనుకున్నాను. అందుకే నేను సినిమా ప్రమోషన్ల కు హాజరవుతూనే ఉన్నాను. త్వరలోనే నా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నా.. అంటూ విష్ణు విశాల్ తనకున్న వ్యాధి ఏమిటో అనేది బయటపెట్టాడు.

 

Vishnu Vishal Health Update