బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కు ఆదరణ కరువు
Netizens Slam Bigg Boss Agnipariksha Tasks
బిగ్ బాస్ సీజన్ 9 అప్పుడు అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్స్ ని తీసుకొచ్చి కొన్ని టాస్క్ లు పెట్టి అందులో గెలిచిన మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, శ్రీజ, ప్రియా, దివ్య లను హౌస్ లోకి తీసుకొచ్చారు. అప్పటి సీజన్ కోసం అగ్నిపరీక్ష కు కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి.
ఇప్పుడు ఈ సీజన్ కి కూడా అగ్నిపరీక్ష పెట్టి కంటెస్టెంట్స్ ని ఆహ్వానిస్తున్నారు. కానీ బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కు ఆదరణ కరువైంది. అంతగా ఈ సీజన్ అగ్నిపరీక్షను పట్టించుకోవడం లేదు. కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్ మాత్రమే అగ్నిపరీక్ష కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఆ దరఖాస్తుల స్వీకరణకు డెడ్ లైన్ ముగిసింది. కానీ సీజన్ 10 అగ్నిపరీక్షకు అనుకున్న స్పందన లేకపోవడంతో స్టార్ మా మరోసారి ఆ దరఖాస్తులు చేసుకునేవారికి గోల్డెన్ ఆపర్చ్యునిటీ అంటూ మరికొంత సమయం ఇచ్చింది. మరి ఈ సీజన్ కి ఎంతమందిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపిస్తారో చూడాలి.







































