ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Why Sukumar Refuses to Talk About RC17?

RC 17 ఇప్పుడే చెప్పరట

Why Sukumar Refuses to Talk About RC17?

అనుకున్నదే అయ్యింది. రామ్ చరణ్ పెద్ది తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు. దాదాపు ఓ మూడు నెలల పాటు రామ్ చరణ్ రెస్ట్ తీసుకుంటారు. ఆతర్వాత ఆయన సుక్కు ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారననే టాక్ నిజమైంది. రామ్ చరణ్ కి పెద్ది సెట్స్ లో చిన్న చిన్న ఇంజ్యురీస్ అయ్యాయి. వాటికి చరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి.

ఆ విషయం సుకుమార్ నేరుగా చెప్పకుండా RC 17 పై ఇప్పుడే ఏమి చెప్పలేను అంటూ మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ మోడ్ లోకి నెట్టేశారు. గత రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ కానీ హీరో రామ్ చరణ్ కానీ RC 17 అప్ డేట్ బయటపెట్టలేదు.

సుకుమార్ స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చెయ్యగానే మెగా ఫ్యాన్స్ RC 17, RC 17 అప్ డేట్ ప్లీజ్ అంటూ అరవడం మొదలు పెట్టారు. కానీ సుకుమార్ తెలివిగా RC 17 గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను, నాకు ముందే అన్నీ చెప్పేయడం ఇష్టం ఉండదు. ఆ సస్పెన్స్ ఏంటో మీరే ఊహించుకోండి. అప్‌డేట్ చెప్పనందుకు ఐ యామ్ వెరీ సారీ! అంటూ తప్పించుకున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంత అరిచి గోల చేసినా సుక్కు మాత్రం ఈ సినిమా గురించి చెప్పలేను అంటూ సైలెంట్ గా సైడ్ అయ్యారు.

Director Sukumar Teases Fans With Rc 17 Update At Peddi Success Meet