ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chengalpattu court to take up Vijay‘s divorce case today

నేడు విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ

Chengalpattu court to take up Vijay‘s divorce case today

తమిళనాడు స్టార్ హీరో విజయ్ కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన భార్య సంగీత విడాకుల నోటీసు పంపించడం చర్చనీయాంశం అయ్యింది. గత ఏడాది డిసెంబర్లోనే సంగీత చెన్నై లోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వెయ్యగా.. అది ఎన్నికల ముందు విచారణకు వచ్చింది.

ఎలెక్షన్ ప్రచారంలో విజయ్ ఈ విడాకుల విషయమై ఇండైరెక్ట్ గా మాట్లాడారు. సంగీత్ వెనుక ఎవరో ఉండి విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకే ఈ విడాకుల కేసు వేయించారని అన్నారు. అయితే సంగీత మాత్రం తన భర్త విజయ్ సహనటి(త్రిష) తో క్లోజ్ గా ఉంటున్నారనే విషయమై తనకు విడాకులు కావాలని, విడాకులు వచ్చేవరకు తనను విజయ్ ఇంట్లోనే ఉండేలా కోర్టు చెప్పాలని సంగీత కోర్టు ను కోరింది.

ఈమద్యలో సంగీత బిజెపి లోకి వెళుతుంది, ఆమె రాజకీయ అరంగేట్రం బిజెపి నుంచే అన్నారు. అదలా ఉండగా నేడు జూన్ 15 న సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ కు వచ్చింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ  కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో తీర్పు ఎలా రానుందో అని యావత్ తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

 

Chengalpattu court to take up Tamil Nadu CM Vijay‘s divorce case today