ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Satish Kilaru admits that Peddi underperformed in North

నార్త్, ఓవర్సీస్ లో పెద్దిని పట్టుకోలేదు

Satish Kilaru admits that Peddi underperformed in North

 

జూన్ 4 న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మర్కెట్ లో విడుదలైన పెద్ది చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ కలెక్షన్స్ తీసుకొచ్చినా మిగతా భాషల్లో ముఖ్యంగా నార్త్ లో ఇంకా ఓవర్సీస్ లో పెద్ది చిత్రానికి నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్లు మాత్రం రాలేదు. అది చాలామందికి షాకింగ్ విషయమే.

తాజాగా పెద్ది సక్సెస్ మీట్ లో మీడియా మిత్రులు నిర్మాత కిలారు సతీష్ ని, దర్శకుడు బుచ్చిబాబు ని పెద్ది చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నదానికన్నా మించి హిట్ అయ్యింది, కలెక్షన్స్ బావున్నాయి. కానీ ఓవర్సీస్ లోను, నార్త్ లోను పెద్ది కలెక్షన్స్ ఎందుకు డల్ అయ్యాయి అని అడగగా.. దానికి పెద్ది నిర్మాత మాట్లాడుతూ..

అవును ఓవర్సీస్ లో పెద్ది చిత్రానికి మేము అనుకున్న కలెక్షన్ రాలేదు. ఏంటో మరి అన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా అనుకున్నంత కలెక్షన్ అయితే రాలేదు...ఇది మాకు కూడా కేస్ స్టడీ లాంటిదే. ఇక నార్త్ లో ఒక సినిమాను టక్కున పట్టుకుంటారు, ఒక సినిమాని పట్టుకోరు. పెద్ది పట్టుకోవాల్సిన సినిమా. నార్త్ లో పెద్దికి 40 ఎంతో ఉంది. ఇంకో వీక్ ఉంది. పెద్ది మంచి సినిమా.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

Producer Venkata Satish Kilaru admits that Ram Charan's Peddi underperformed in North