Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The wait for Lenin just got a little longer!

లెనిన్ కొత్త డేట్ అదేనా?

The wait for Lenin just got a little longer!


అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ చిత్రం ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ చిత్రం పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు కనిపిస్తున్నాయి. ఈలోపు మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అంటూ ప్రెస్ నోట్ వదిలారు. పెద్ది కోసం మే 1 నుంచి పోస్ట్ పోన్ అయిన లెనిన్ చిత్రం జూన్ 26 న పక్కాగా విడుదల అనుకుంటే అభిమానులను డిజప్పాయింట్ చేస్తూ మళ్లీ పోస్ట్ పోన్ అన్నారు.

అయితే లెనిన్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళి అబ్బూరి ఈ చిత్రాన్ని జూన్ 26 నుంచి పోస్ట్ పోన్ చేసిన పది రోజుల తర్వాత అంటే జూన్ 10 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ తేదీని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారని సమాచారం.

మరి అక్కినేని అభిమానులు ఓ తెగ ఇదైపోకుండా.. ఓ పది రాజుల గ్యాప్ లో అఖిల్ అక్కినేని లెనిన్ ని చూసుకుని ఎంజాయ్ చేసెయ్యండి. 

Lenin new date arrived