Advertisement

పెద్ది హిందీ మరీ ఇంత వీకా..

Peddi Hindi Performance


రామ్ చరణ్ పెద్ది చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడమే కాదు.. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేసింది టీమ్. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి పెద్దిపై నార్త్ ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసారు. భోపాల్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, విజయవాడ ఇలా చాలా బాగా పెద్దిని ప్రమోట్ చేసారు.

అయితే పెద్ది కి నార్త్ లో అనుకున్నంతగా ఓపెనింగ్స్ రాలేదు సరికదా.. మొదటి వారంలోను హిందీలో పెద్ది పెరఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటిదాకా నార్త్ మార్కెట్లో పెద్ది చిత్రానికి రూ.18 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి పెద్ది లాంటి బిగ్ మూవీకి ఈ ఫిగర్ చాలా చిన్నది.

హిందీలోనూ అదిరిపోయే చిత్రాలేవీ పెద్ది కి పోటీగా రాలేదు. ధురంధర్ 2 తర్వాత బాలీవుడ్ లో ఆ స్థాయి సినిమా రాలేదు. పెద్ది ఓపినింగ్స్ బాగోకపోయినా.. రెండోరోజు నుంచి టాక్ చూసి కలెక్షన్స్ పెరుగుతాయని అనుకుంటే.. విడ్డురంగా పెద్దికి మొదటివారంలో కేవలం రూ.18 కోట్లు రావడం అందరికి షాకిచ్చింది. 

Peddi - Ram Charan