Advertisement

దృశ్యం 3 ఓటీటీ డేట్ లాక్డ్

Drishyam 3 OTT Release Date Out


మోహన్ లాల్-జీతూ జోసెఫ్ కాంబోలో మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ సీరీస్ దృశ్యం నుంచి మే 21 న దృశ్యం 3 విడుదలైంది. పార్ట్ 1, పార్ట్ 2 మంచి హిట్స్ గా నిలవగా దృశ్యం 3 కి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. దృశ్యం 3 కి థియేటర్స్ లో మొదటి రోజు డివైడ్ టాక్ కనిపించినా ఈచిత్రం రన్ లో రూ.250 కోట్లు కొల్లగొట్టింది.

డివైడ్ టాక్ తో రూ.250 కోట్లు తీసుకొచ్చిన దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 మంచి హిట్స్ గా నిలవడంతో దృశ్యం 3 ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో చేజిక్కించుకుంది. థియేటర్స్ లో మే 21 న విడుదలైన దృశ్యం 3..

అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ నెల అంటే జూన్ 18 న స్ట్రీమింగ్ లోకి రానున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చిన దృశ్యం 3 ని అక్కడ మిస్ అయిన వారు జూన్ 18 నుంచి ఓటీటీ వీక్షించెయ్యొచ్చు.

Drishyam 3 will premiere on Amazon Prime Video