Advertisement

అలాంటి పాత్ర‌ల కోసం మ‌హాన‌టి ఎదురు చూపు!

Keerty Suresh Hopes for Better Roles

చిత్ర పరిశ్రమలో ఒక  నటి కెరీర్‌ను  మార్చేసే పాత్రలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన పాత్రతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్  మళ్లీ  నటనకు ఆస్కారమున్న బలమైన పాత్రల కోసం ఆశగా ఎదు రుచూస్తోంది. ఒక మహోన్నత నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన `మహానటి` చిత్రంలో  కీర్తి సురేష్  అద్వితీయ నటన విమర్శకుల ప్రశంసలతో పాటు అత్యున్నత జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

ఆ సినిమా సాధించిన ఘన విజయం తర్వాత కీర్తి వరుసగా పెద్ద ప్రాజెక్టులు, వాణిజ్య పరమైన చిత్రాల్లో  నటిస్తూ బిజీగా  ఉన్నా? తనలోని నటిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచే , ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మరో మైలురాయి లాంటి పాత్ర కోసం వేచి చూస్తున్నట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సాధారణంగా స్టార్ హోదా దక్కిన తర్వాత కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న చిత్రాలను ఎంచుకోవడం ఏ నటికైనా ఒక సవాలుతో కూడుకున్న విషయమే. కమర్షియల్ చిత్రాల విజయాలు మార్కెట్ పరంగా క్రేజ్ తెచ్చిపెట్టినప్పటికీ నటిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, ఆత్మసంతృప్తిని ఇచ్చేవి మాత్రం వైవిధ్యభరితమైన క్లాసిక్ చిత్రాలేనని ఆమె బలంగా నమ్ముతోంది.

అందుకే  రెగ్యులర్ ఫార్ములా సినిమాలే కాకుండా మహిళా ప్రాధాన్యత ఉన్న విలక్షణమైన కథాంశాలను, తన నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్రలను ఎంచుకునేందుకు కీర్తి   ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. భవిష్యత్తులో దర్శకులు ఎలాంటి వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో వచ్చినా? తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని కీర్తి సురేష్  ఆశాభావం వ్యక్తం చేసింది.

Keerthy Suresh keen on getting meaty roles