Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Taylor Swift makes tearful 21-minute speech as she joins Songwriters Hall of Fame

సంగీత సామ్రాజ్ఞి టేలర్ స్విఫ్ట్ సరికొత్త చరిత్ర!

Taylor Swift makes tearful 21-minute speech as she joins Songwriters Hall of Fame

సంగీత ప్రపంచంలో తనదైన శైలి అద్భుతమైన సాహిత్యం తో మంత్రముగ్ధులను చేసే అంతర్జాతీయ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. సినిమా  రంగంలో అత్యంత ప్రతిష్టాత్మ క‌మైన‌ సాంగ్‌రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆమెకు స్థానం ద‌క్కింది. 36 ఏళ్ల  వయస్సులోనే ఈ ఘనత సాధించడం తో ఈ గౌరవాన్ని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా    సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నేప‌థ్యంలో స్విఫ్ట్ సంగీత ప్రస్థానంలోనే కాదు ఆధునిక సంగీత చరిత్రలోనే  సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది.

ఈ  విజయంతో టేలర్ స్విఫ్ట్ గతంలో సంగీత ప్రపంచాన్ని శాసించిన దిగ్గజాల రికార్డులను సైతం తిరగ రాసారు. మరియా కేరీ, డాలీ..పార్టన్ వంటి మహోన్నత గాయనీమణులు.. గేయరచయితలు  సుదీర్ఘ కెరీర్ తర్వాత సాధించిన ఈ మైలురాయిని స్విఫ్ట్  చిన్న వయస్సులోనే అందుకోవడం విశేషం.  టేల‌ర్   పాప్ స్టార్ మాత్రమే కాదని.. భావోద్వేగాలను అద్భుతమైన కావ్యాలుగా మలిచే అసాధారణ సాహిత్యకారిణి గా మరోసారి నిరూపించారు. ప్ర‌స్తుత‌ సంగీత యుగంలో టేల‌ర్ ఇంపాక్ట్ ని  ఈ పురస్కారం మరింత సుస్థిరం చేసింది.

టేలర్ స్విఫ్ట్ విజయ రహస్యం ఆమె రాసే సాహిత్యంలోనే దాగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె  వ్యక్తిగత జీవిత అనుభవాలు.. ప్రేమ.. విరహం.. ఆశలు.. ఆత్మాభిమానాన్ని ప్రతిబింబించేలా టేల‌ర్ రాసే పాటలు ప్రపంచవ్యాప్తంగా  యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రోతలు ఆమె పాటల్లో తమ సొంత కథలను వెతు క్కుంటారు.  కమర్షియల్ విలువలకే పరిమితం కాకుండా ప్రతి పాటలోనూ  కథను..  బలమైన సందేశాన్ని అందించడం స్విఫ్ట్ ప్రత్యేకత. ఈ ర‌క‌మైన  రచనా శైలి ఆమెను తోటి కళాకారుల కంటే ఎంతో ఎత్తులో నిలబెట్టింద‌నొచ్చు.

దశాబ్ద కాలానికి పైగా సాగిన  టేల‌ర్ ప్రయాణంలో కంట్రీ మ్యూజిక్ నుండి పాప్.. ఫోక్.. ప్రత్యామ్నాయ శైలుల వరకు ఆమె చేసిన ప్రయోగాలు మంచి విజయాలు సాధించాయి. మారుతోన్న కాలానికి  .. అభిరుచులకు అనుగుణంగా తనను తాను నిరంతరం పు నిర్మించుకోవ‌డంలో సిద్ధహస్తురాలు. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్  కన్సర్ట్‌ల ద్వారా ఆర్థికంగా .. సాంస్కృతికంగా సృష్టించిన సంచలనాలు ఆమె పాపులారిటీకి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రతికూల పరిస్థితులను సైతం  సానుకూల సాహిత్య శక్తితో జయించడం ఆమెలోని  వ్యూహాత్మక చతురతను తెలియజేస్తుంది.

సంగీత పరిశ్రమలో మహిళా కళాకారుల హక్కుల కోసం.. ముఖ్యంగా వారి సొంత  సంగీత యాజమాన్య హక్కుల  కోసం టేలర్ స్విఫ్ట్ చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. పాత ఆల్బమ్‌లను మళ్లీ రికార్డ్ చేసి టేలర్స్ వర్షన్ పేరుతో విడుదల చేయడంతో పరిశ్రమలోని సాంప్రదాయ ధోరణులను సవాలు చేసింది. ఈ రకమైన సాహసోపేత నిర్ణయాలు టేల‌ర్  వ్యాపారపరమైన విజయాన్ని మాత్రమే కాకుండా కళాకారుల స్వేచ్ఛకు  ప్రతీకగా నిలిచేలా చేశాయి. హాల్ ఆఫ్ ఫేమ్‌లో  టేల‌ర్ చేరిక పోరాట పటిమకు దక్కిన అంతిమ గుర్తింపుగా భావించొచ్చు.
 

Taylor Swift's Latest Custom Gown Might Be Her Best Look Ever