సీఎం అయ్యాక విజయ్ ఫస్ట్ స్టెప్
Minutes of PM Modi - CM Vijay meet
తమిళనాట ఎవరూ ఊహించని విధంగా సీఎం పీఠాన్ని అధిష్టించిన కోలీవడ్ స్టార్ హీరో విజయ్ అక్కడ నూతన సంస్కరణలు చేపట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే అధికారం కోసం వామపక్షాలతో పాటుగా అన్నాడీఎంకే ఎమ్యెల్యేలను అక్కున చేర్చుకున్న విజయ్ రీసెంట్ గా సెన్సిటివ్ ప్రెస్ మీట్ లో పోలీస్ అధికారుల తీరుపై సీఎం స్థాయిలో విజయ్ మొహమాటం లేకుండా వారిపై వేటు వేశారు.
ఇక ఇప్పుడు సీఎం గా ఎన్నికయ్యాక మొదటిసారి ఢిల్లీ వెళ్లి పీఎం మోడీ ని కలిశారు విజయ్. విజయ్ టీవీకే పార్టీ ని తమ పార్టీ తో కలిసి తమిళనాడు లో పోటీ చేసేందుకు బిజెపి ఎంతగా ప్రయత్నం చేసినా విజయ్ ఒప్పుకోకుండా సింగిల్ గానే బరిలోకి దిగాడు. ఇప్పుడు బిజెపి సహకారం లేకుండా సీఎం అయ్యాడు.
మరి సీఎం అయ్యాక ఆ హోదాలో పీఎం నరేంద్ర మోడీని కలవడం మాత్రం నిజంగా హైలెట్ అయ్యింది. తమిళనాడు కు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని విజయ్ మోడీ ని కలిసి కోరినట్లుగా తెలుస్తుంది.







































