ఈసారి మిస్ అయిన మహేష్
Mahesh Babu Is Missing His Vacation Days
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లల స్కూల్ హాలిడేస్ చూసుకుని ఏడాదికి మూడునాలుగుసార్లు విదేశీ ట్రిప్స్ వేసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడమనేది చూస్తున్నాం, ఆయన కూడా అదే చెబుతారు. అందులోను మహేష్ బాబు తన పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ ను అస్సలు మిస్ అవరు. స్పెయిన్, యుఎస్, దుబాయ్ ఇలా ఏదో ఒక దేశానికీ వెళ్ళిపోతారు.
కానీ ఈ ఏడాది రాజమౌళి మహేష్ కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వకుండా హీట్ సమ్మర్ లోనే మహేష్ తో వారణాసి షాట్ చేస్తున్నారు. ఇప్పటికే మే లో మహేష్-ప్రియాంక చోప్రాలపై ఓ సాంగ్ చిత్రీకరించిన రాజమౌళి మళ్లీ జూన్ లో లెంతి షెడ్యూల్ ప్లాన్ చేసేసారు. దాని కోసం అంటార్కటిక వెళతారా లేదంటే అనేది తెలియాల్సి ఉంది.
ఇలా షూటింగ్ కి గ్యాప్ లేకుండా, మహేష్ కి సమ్మర్ హాలీడేస్ ఇవ్వకుండా రాజమౌళి వారణాసి షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. ఇక మహేష్ అవైలబుల్ లేకపోవడంతో నమ్రతానే పిల్లలు గౌతమ్, సితార ను తీసుకుని ఈ ఏడాది సమ్మర్ ట్రిప్ వేసేసారు. ఇక మహేష్ జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ లో స్పెషల్ ట్రేనింగ్ తీసుకుని వచ్చారు.







































