విశ్వంభరకు మోక్షం లేదా?
Vishwambhara release date update
మెగాస్టార్ చిరంజీవి విశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుని అనిల్ రావిపూడి తో మన శంకర వార ప్రసాద్ పూర్తి చేసి విడుదల చేసి ఐదు నెలలైంది. మళ్లీ ఇంకోటి అన్నట్టుగా బాబీ కొల్లి దర్శకత్వంలో మెగా 158 ని రీసెంట్ గా స్టార్ట్ చేసి షూటింగ్ కి వెళ్ళబోతున్నారు.
వీటన్నింటికన్నా ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభరకు రిలీజ్ మోక్షం కలగడం లేదు. పెద్ది విడుదల తేదీ వచ్చాక చిరు విశ్వంభర రిలీజ్ తేదీ వచ్చేస్తుంది అనుకుంటే వసిష్ఠ నుంచి ఎలాంటి న్యూస్ లేదు. మెగా ఫ్యాన్స్ విసిగిపోయారు. విశ్వంభరను మర్చిపోయారు.
మెగా ఫ్యాన్స్ వసిష్ఠ ను విశ్వంభర రిలీజ్ డేట్ పై అడగడం మానేశారు. మరి వసిష్ఠ విశ్వంభర నుంచి ఎలాంటి కంటెంట్ వదిలితే సినిమాపై హైప్ వస్తుంది. ట్రైలర్ అన్నారు, ఇంతవరకు దాని జాడ కనిపించడం లేదు. విశ్వంభర విడుదల తేదీ వచ్చాక కానీ అంతో ఇంతో సినిమాని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తే క్రేజ్ వస్తుంది. లేదంటే.. విశ్వంభర పని అంతే.







































