ధనుష్ కర ఓటీటీ డేట్ లాక్
Dhanush's Kara Gets OTT Release Date
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ కర. మే 1 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి యావరేజ్ రెస్పాన్స్ కనిపించింది. ధనుష్ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయినా కథలో బలం లేకపోవడంతో కర థియేటర్స్ లో జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది.
ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ఓటీటీ డీల్ తో సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ చిత్రాన్ని మే 28 నుంచి ఓటీటీ ఆడియన్స్ కోసం అందుబాటులోకి రానున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. అది కూడా కర పలు భాషల్లో ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మే 28 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
Kara Gets OTT Release Date







































