ప్రభాస్ పై వివేక్ ఒబెరాయ్ ప్రసంశలు

ప్రభాస్ తో పని చేసిన నటులులైనా, హీరియిన్స్ అయినా ఎవ్వరైనా ఆయన్ని పొగడకుండా ఉండలేరు. ప్రభాస్ ఆతిద్యానికే కాదు ఆయన మాట తీరు, ఆయన బిహేవియర్ కి కూడా ఫిదా కానీ వారు ఉండరు. అలా ఇప్పుడు బాలీవుడ్ నటుడు ప్రభాస్ ని చూసి చాలా సర్ ప్రైజ్ అవుతూ ప్రశంశలు గుప్పిస్తున్నారు.
ఆయనే ప్రభాస్ స్పిరిట్ లో విలన్ రోల్ లో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్. సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. దానితో పాటుగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా స్పిరిట్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రభాస్ ని ఆకాశానికెత్తేశారు.
ప్రభాస్ ఎంతోమందికి స్ఫూర్తి అంటూ.. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా.. ప్రభాస్ దాన్ని లెక్కచెయ్యకుండా పట్టుదలతో తన పని పూర్తి చేస్తున్నారు. ఆయన చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకునే విధానం నాకు చాలా ఇష్టం. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ అందరితో కలిసిపోయే తీరు ఆకట్టుకుంటుంది. స్టార్డమ్ ఏమాత్రం చూపించరు.
ప్రభాస్ లో గర్వం అసలు కనిపించదు. అంతేకాదు ఆయన లోకేషన్ కు తీసుకువచ్చే రుచికరమైన వంటల గురించి మాటల్లో చెప్పలేం... అంటూ వివేక్ ఒబెరాయ్ ప్రభాస్ ని తెగ పొగిడేశారు.






































