Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Karuppu becomes Suriya's highest-grossing film ever

కామ్ గా వచ్చి రూ.200 కోట్లు కొట్టేసాడు


అవును కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సైలెంట్ గా రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరిపోయాడు. కరుప్పు చిత్రం మిక్స్డ్ టాక్ తోనే రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరింది అంటే నిజంగా నమ్మసఖ్యంగా లేదు అంటున్నారు. గత శుక్రవారం విడుదలైన కరుప్పు చిత్రానికి తమిళనాట మంచి టాక్ కనిపించినా తెలుగులో సో సో టాక్ వచ్చింది.

దానితో సూర్య ఖాతాలో మరో ప్లాప్ కరుప్పు తో పడింది అన్నారు. కానీ ఫస్ట్ వీకెండ్ లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన సూర్య కరుప్పు ఫస్ట్ వీక్ గడిచేనాటికి రూ.200 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా ఎంటర్ అయ్యింది. అదే విషయాన్ని మేకర్స్ రూ.207 కోట్లు కరుప్పు అంటూ అఫీషియల్ గా ప్రకటించారు.

మరి నిజంగా ఎలాంటి హడావిడి లేకుండా సూర్య ని రెండు వందల కోట్ల క్లబ్బులో నిలిపింది కరుప్పు. రెండు వారాలు గడిచేసరికి సూర్య రూ.300 కోట్ల క్లబ్బులో కూర్చోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ కరుప్పు రూ.300 కోట్లు కొల్లగొడితే తమిళనాట బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది. 

Karuppu MovieKaruppu becomes Suriya's highest-grossing film ever