వెంకీ తెలివిగా తప్పించుకున్నారు

నిజమే దృశ్యం సీరీస్ నుంచి వెంకటేష్ తెలివిగా తప్పిన్చుకున్నారు. మలయాళంలో హిట్ అయిన మోహన్ లాల్-జీతూ జోసెఫ్ ల దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. దృశ్యం మంచి హిట్ అవ్వగా.. దృశ్యం 2 జస్ట్ హిట్ అయ్యింది.
తాజాగా మలయాళంలో విడుదలైన దృశ్యం 3 సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాకా అదే సమయంలో వెంకీ కూడా దృశ్యం 3 స్టార్ట్ చేస్తారనుకున్నారు. కానీ వెంకీ సైలెంట్ గా ఉండిపోయారు. దృశ్యం 3 మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ పూర్తి చేసి నిన్న మే 21 న విడుదల చేసారు.
అయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ అవ్వకపోవడంతో డబ్ చేసి వదిలారు. దృశ్యం 3కి తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ కూడా రాలేదు. జస్ట్ సో సో గా ఉంది అంటూ క్రిటిక్స్ పెదవి విరిచారు. దృశ్యం 3 టాక్ చూసాక వెంకీ ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యకుండా తెలివిగా తప్పించుకున్నారు అంటూ దగ్గుబాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






































