బాలయ్య-కొరటాల కాంబో దసరా కి స్టార్ట్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఆ విషయం నిన్ననే అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
గోపీచంద్ తర్వాత బాలయ్య లైన్ లోకి కొరటాల శివ వచ్చారు. రీసెంట్ గానే బాలయ్య-కొరటాల కాంబో పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని కొరటాల శివ దసరా కి స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్ కి వెళ్లాలని చూస్తున్నారట. ఈలోపే బాలయ్య NBK 111 షూటింగ్ ఓ కొలిక్కి వస్తే.. అప్పుడు కూల్ గా NBK 112 ని లైన్ లో పెట్టాలనేది కొరటాల శివ ప్లాన్.
జూన్10 న బాలయ్య బర్త్ డే కి కొరటాల శివ నందమూరి అభిమానుల కోసం ఫస్ట్ లుక్ సిద్ధం చేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ ని కొరటాల సంప్రదిస్తున్నారని అంటున్నారు.






































