Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Suresh Opens Up About Fitness Journey

అందుకే మీడియాకి దూరంగా - కీర్తి సురేష్

Keerthy Suresh Opens Up About Fitness Journey

మహానటి తర్వాత బాగా పాపులర్ అయిన కీర్తి సురేష్ కి తెలుగులో టాప్ స్టార్స్ తో అవకాశం దక్కకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కీర్తి సురేష్ కి దుమ్మురేపే హిట్టు అయితే పడలేదు. మహానటి తర్వాత సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యింది. దసరా తో మంచి హిట్ కొట్టినా ఆతర్వాత కీర్తి సురేష్ కెరీర్ డల్ అయ్యింది.

అయితే మహానటికి ముందు బబ్లీ గా కనిపించిన కీర్తి సురేష్ మహానటి బరువు ను వదిలించుకునెందుకు చాలా కష్టపడింది. జిమ్ లో వర్కౌట్స్ చేసింది, యోగ చేసింది. సన్నబడింది. గ్లామర్ షో మొదలు పెట్టింది. అయితే అప్పట్లో కీర్తి బబ్లీ లుక్ పై విమర్శలు చేసిన వారే ఆమె సన్నబడిన తర్వాత కూడా కామెంట్స్ చేసారు.

ఆ విషయంపైనే కీర్తి సురేష్ స్పందిస్తూ లావుగా ఉంటే లావుగా ఉన్నాను అంటారు, కష్టబడి సన్నబడితే లైపో చేయించుకుంది, ఆమె బబ్లీ లుక్ బావుంది. ఇంత సన్నగా బాలేదు అంటారు. నేను ఎంతో కష్టపడి వర్కౌట్స్ చేసి, యోగ చేసి వెయిట్ లాస్ అయితే అది సర్జరీ తో సాధ్యమైంది అని సింపుల్ గా అనేస్తారు.

నా కష్టమంతా ఓ సర్జరీ ఖాతాలోకి వెళ్లిపోవడం బాధగా అనిపించింది. ప్రస్తుతం తను వర్కౌట్స్, యోగ చేసుకుంటూ హెల్దీగా ఉన్నానని, ఇక మీడియా ముందుకు రాకపోవడానికి కారణం తను ఈ మధ్యన మానసికంగా, శారీరకంగా ఎదురు దెబ్బలు తినడం వల్లె కాస్త విరామం తీసుకున్నట్లుగా కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

Keerthy Suresh ,