విజయ్ గురించి అడిగితే సిగ్గుపడుతుంది
Trisha blushes after fan mentions Vijay
తమిళనాడు సీఎం విజయ్ తో నటి త్రిష కి మధ్యన రీల్ సంబంధం కాదు, రియల్ సంబంధమే అని లోకం కోడై కూస్తుంది. విజయ్ సీఎం అయినప్పుడు త్రిష జయలలిత మాదిరి చెయ్యి ఊపుతూ విజయ్ పక్కన అంతలా హైలెట్ అయ్యాక వారి మద్యన ఏమి లేదు అని వారే చెప్పినా ఈలోకం నమ్మదు.
విజయ్ భార్య సంగీత తో డివోర్స్ తీసుకున్న వెంటనే త్రిష ను వివాహము చేసుకుంటారనే టాక్ ఉండగా.. త్రిష లేటెస్ట్ మూవీ కరుప్పు విడుదల అయిన సందర్భంగా ఆమె థియేటర్స్ లో సినిమాని వీక్షించడానికి వెళ్ళినప్పుడు అభిమానులు త్రిష ను విజయ్ గురించి అడగగా.. త్రిష సిగ్గుపడుతూ కనిపించింది.
విజయ్ పేరు ఎత్తగానే త్రిష సిగ్గుమొగ్గలైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారి విజయ్ త్రిష ను ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారనే విషయమై అందరిలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తుంది.
Trisha blushes over Vijay








































