Advertisement

నిఖిల్ స్వయంభు ఏమైపోయింది

పాన్ ఇండియా స్టార్ నిఖిల్ లేటెస్ట్ మూవీ స్వయంభు ఏమైపోయింది. అసలు స్వయంభు ఈ ఏడాది రిలీజ్ ఉంటుందా, నిఖిల్ కూడా ప్రమోషన్స్ ఆపేసాడు అంటూ కామెడీ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. స్వయంభు విడుదల తేది ఇవ్వకుండా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. నిఖిల్ చాలా యాక్టీవ్ గా ప్రమోషన్స్ లో కనిపించాడు.

మే 22 స్వయంభు ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు మేకర్స్ ఆ తేదీ పై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా స్వయంభు ఏమైపోయింది నిఖిల్ అంటూ ఆయన ఫ్యాన్స్ అడుగుతున్నారు. స్వయంభు ఓటీటీ డీల్ తెగని కారణంగానే స్వయంభు విడుదల తేదీ విషయంలో మేకర్స్ తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తుంది.

కేవలం ఓటీటీ డీల్ సెట్ కాకపోవడమే స్వయంభు విడుదల ఆలస్యమంటున్నారు. మరోపక్క సినిమా విడుదలకు అన్ని సిద్ధం చేసి రిలీజ్ తేదీ ఇవ్వకుండా నాన్చడమే చాలామందికి అర్ధం కావడం లేదు. టీజర్ తో ఒక్కసారిగా హైప్ మొదలైన స్వయంభు పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తేదీ ఇస్తే బావుంటుంది అంటున్నారు.

Nikhil SwayambhuSwayambhu Movie Release Date Update
Advertisement
Advertisement