Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Paschima Bengal - BJP has reportedly crossed the majority mark

దీదీ అధికారానికి బిగ్ షాక్

Paschima Bengal - BJP has reportedly crossed the majority mark

గత పదిహేడేళ్లుగా పశ్చిమ బెంగాల్ ను ఏక ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న దీదీ అధికారానికి బిజెపి చెక్ పెట్టింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఊహించని ఫలితాలు నమోదు అవుతున్నాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది.
బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మేజిక్ ఫిగర్ (148) దాటి 180కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 100-105 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మరి పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఆధిక్యత స్పష్టమవుతుంది.
దీనిని బట్టి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యానికి ఈ ఎన్నికలు అడ్డుకట్ట వేసినట్టే కనిపిస్తుంది. బీజేపీ అధికారం చేపట్టి కొత్త సంస్కరణలకు తెరలేపబోతుంది. అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో చక్రం తిప్పబోతున్నారు. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తుంది.
 

Paschima Bengal Election result