చిరు, పవన్ ల కాదు విజయ్

కోలీవుడ్ హీరో విజయ్ పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు ఆయన కూడా చిరు, పవన్ లా రాజకీయాల్లో పోరాడాలి, అప్పడు కానీ విజయం రాదు. ప్రజలు, అభిమానులు సినిమాల్లో సపోర్ట్ చేసినట్లుగా రాజకీయాల్లో సపోర్ట్ చెయ్యరు. పవన్ మాదిరి విజయ్ కూడా రాజకీయాల్లో ఫెయిల్ అవుతారని అన్నారు.
అప్పట్లో చిరు అభిమానుల అండతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పోటీ చేస్తే కేవలం18 సీట్లకి పరిమితమై సైలెంట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పదేళ్లు రాజకీయాల్లో ఒక్క సీటు గెలవకుండా ఎంతగా స్ట్రగుల్ అయ్యారో అందరూ చూసారు. అదే మాదిరి తమిళనాట పార్టీ స్థాపించిన విజయ్ కూడా ఫెయిల్ అవుతారని భావించారు రాజకీయ విశ్లేషకులు. సినిమా అభిమానం రాజకీయాల్లో పనికిరాదని మాట్లాడారు.
కానీ అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట విజయ ఢంకా మోగించేయానికి అడుగు దూరంలో ఉంది. విజయ్ పార్టీ పెట్టిన 27 నెలల్లోనే విజయాన్ని ద్కకించుకోబోతున్నారు. విజయ్ అభిమానులు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ విజయ్ కి సపోర్ట్ గా నిలిచారు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించేందుకు సిద్దమైంది. అక్కడి ఎన్నికల ఫలితాల్లో 110 సీట్ల ఆధిక్యంలో విజయ్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. 118 మ్యాజిక్ ఫిగర్ అందుకోయిపోయినా విజయ్ తమిళనాట అధికారం చేపెట్టేందుకు హంగ్ గా ఏర్పడే అవకాశం ఉంది.
అధికారంలో ఉన్న స్టాలిన్ డీఎంకే పార్టీ వెనుకబడిపోవడం అందరికి షాకిచ్చింది. విజయ్ టీవీకే వెనుకే ఏఐడీఎంకే పార్టీ మెజారిటీ సాధిస్తుంది. మరి చిరు, పవన్ లా కాదు రాజకీయాల్లోకి రాగానే విజయ్ తన స్టామినా ఈ ఎన్నికల్లో చూపించారు.








































