ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jennifer Lopez turns Netra Mantena Udaipur wedding

57 ఏళ్ళ వ‌య‌సులో హీటెక్కిస్తున్న గాయ‌ని

Jennifer Lopez turns Netra Mantena Udaipur wedding

అమెరికాలో సెటిలైన‌ భార‌తీయ ఫార్మా దిగ్గ‌జం ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన - సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు జోడీ పెళ్లి వేడుక‌లో అంత‌ర్జాతీయ పాప్ ఐక‌న్ జెన్నిఫ‌ర్ లోపేజ్ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు.

జెలో రెండు రోజుల క్రిత‌మే ఉద‌య్ పూర్ (రాజ‌స్థాన్)లో జ‌రుగుతున్న పెళ్లి ఈవెంట్లో అడుగుపెట్టారు. ఆదివారం నాటి ప్ర‌ధాన‌మైన వివాహ వేడుక‌లో త‌న సంగీత క‌చేరీతో అహూతులను రంజింప‌జేసారు. జెలో 57వ‌య‌సులోను ఎంతో ఎన‌ర్జిటిక్ గా వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న వీడియో క్లిప్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వేడెక్కిస్తున్నాయి. ఈ బ్యూటీ ఎందుకు ఏజ్ లెస్ క్వీన్ గా వెలిగిపోతోందో త‌న ఎన‌ర్జీ చూసాక అర్థం చేసుకోవ‌చ్చు. ఈవెంట్లో జెన్నిఫ‌ర్ లోపేజ్ ప్ర‌ద‌ర్శ‌న కోసం కోట్లాది రూపాయ‌ల పారితోషికం వ‌సూలు చేసింద‌ని కూడా గుసగుస‌లు వినిపిస్తున్నాయి. జెన్నిఫ‌ర్ లోపేజ్ ఈ వేడుక కోసం ధ‌రించిన డిజైన‌ర్ మోనోకిని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఏజ్ లెస్ బ్యూటీ ఒంపు సొంపుల‌ను ఈ డిజైన‌ర్ లుక్ హైలైట్ చేసింది. వేదిక‌పై గానాలాప‌న చేస్తూ జెలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చింది. త‌న కెరీర్ లో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌ను ఎంపిక చేసుకుని వాటికి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది.

అంబానీల పెళ్లి త‌ర్వాత భార‌త‌దేశంలో అత్యంత ఖ‌రీదైన‌ వివాహ వేడుక‌గా ఈ పెళ్లి గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం బాలీవుడ్ నుంచి ప‌లువురు సినీతార‌లు హాజ‌రై ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.  దాదాపు 5000 కోట్ల మేర ఈ పెళ్లికి ఖ‌ర్చు చేస్తున్నార‌ని స‌మాచారం.

Jennifer Lopez visited India for the first time to perform at Netra Mantena wedding

jennifer lopez