ఉచిత సినిమాల‌తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

Free Movies

మీ మొబైల్ కి ఉచిత సినిమాలు, ఉచిత డౌన్ లోడ్ ల ఆఫ‌ర్ పేరుతో ఏవైనా లింకులు వ‌స్తే, అవి ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని అన్నారు సిపి స‌జ్జ‌నార్. అలాంటి ఫేక్ లింకుల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. అత్యాశ‌కు పోతే మోస‌గాళ్ల సైబ‌ర్ వ‌ల‌కు చిక్క‌డం ఖాయ‌మ‌ని అన్నారు. హ్యాక‌ర్లు డిజిట‌ల్ అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారు. ఫేక్ వెబ్ సైట్లు, ఫేక్ యాప్ ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా ప్ర‌జ‌ల‌కు సూచించారు. అలాగే లావాదేవీలు జ‌రిగే ప్ర‌తి దానికి బ‌లమైన పాస్ వ‌ర్డ్స్ ఉప‌యోగించాల‌ని కూడా సీపీ సూచించారు.

అలాగే త‌న పేరుతో నకిలీ ఫేస్ బుక్ ద్వారా చాలా మోసం చేస్తున్నార‌ని, అలాంటి వాటిని న‌మ్మొద్ద‌ని కూడా సీపీ అన్నారు. త‌న ఒరిజిన‌ల్ ఎఫ్.బి ఖాతా గురించి వివ‌రాల‌ను బహిర్గ‌తం చేసారు.  ``నేను ప్రమాదంలో ఉన్నాను... వెంటనే డబ్బు పంపండి`` అంటూ భ‌య‌పెట్టే మెసేజ్‌లను న‌మ్మొద్ద‌ని సూచించారు. డబ్బు అభ్యర్థించే వారి నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దని లేదా సందేశాలకు ప్రతిస్పందించవద్దని సజ్జనార్ హెచ్చరించారు.

సైబర్ మోసానికి పాల్పడిన నకిలీ ఖాతాలను ఎదుర్కొనే ఎవరైనా 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సిఫార్సు చేశారు. మోసపూరిత సోష‌ల్ మీడియా ఖాతాలను గుర్తించి తొలగించడానికి మెటాతో పోలీస్ శాఖ ప‌ని చేస్తోంద‌ని కూడా వెల్ల‌డించారు.

Free Movies

movies