సర్ప్రైజింగ్ కాంబినేషన్

Sun Pictures Announced Thalaivar171

కొన్నిసార్లు అనుకోని కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి. అవి ఊహించడానికి కూడా ఊహకి అందనివి. సక్సెస్-సక్సెస్ కలవడం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. కానీ ఆ కాంబినేషాన్ సెట్ అయితే అభిమానులకి పండగే. ఇప్పుడు అలాంటిదే కోలీవుడ్ లో ఒకటి జరిగింది. అదే సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ ల కలయిక. జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజినీకాంత్-విక్రమ్ తో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ల కలయిక. లియో మూవీతో వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు లోకేష్. 

ఇక జైలర్ తర్వాత సూపర్ స్టార్ కూడా లాల్ సలాం లో గెస్ట్ రోల్ చేసారు. ఇప్పుడు తమకి ఎక్కడలేని లాభాలు తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ తో లోకేష్ కనకరాజ్ సినిమా చేసేలా ప్లాన్ చేసారు సన్ పిక్చర్స్ వారు. జైలర్ మూవీతో లాభాలు తెచ్చిపెట్టిన రజినీకాంత్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ తో సినిమా చేస్తున్నట్టుగా సన్ పిక్చర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇవ్వడంతో అందరూ సర్ప్రైజింగ్ కాంబినేషన్ అంటూ మాట్లాడుకుంటున్నారు.  

ఈ కాంబోతో సూపర్ స్టార్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. నిజంగా వీరి కలయికలో మూవీ సెట్స్ మీదకి వెళితే అంచనాలు, క్రేజ్ మాములుగా ఉండవు. 

Sun Pictures Announced Rajinikanth Next In Lokesh Kanagaraj Direction

thalaivar171