సలార్ విషయంలో సైలెంట్ అయిన మేకర్స్

Makers are silent on SalaarMakers are silent on Salaar

సలార్ ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా నెలరోజుల సమయమే ఉంది. సెప్టెంబర్ 28 న ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ పార్ట్ 1న విడుదలకాబోతుంది. కానీ ఇంతవరకు మేకర్స్ సలార్ ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ గా ఉండడం ప్రభాస్ ఫాన్స్ కి నచ్చడం లేదు. గతంలోలా ఈ చిత్రానికి ప్రమోషన్స్ లైట్ తీసుకుంటే కుదరదని నిర్మాణ సంస్థపై అభిమానులు ఒత్తిడి తెస్తున్నా మేకర్స్ మౌనాన్నే పాటిస్తున్నారు. 

ఏదో పాటన్నారు, ప్రభాస్ బెంగుళూర్ వెళ్లాడన్నారు. దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ కానీ , సలార్ నిర్మాతలు కానీ, మిగతా టెక్నీకల్ సిబ్బంది కానీ, నటులు కానీ ఇలా ఎవ్వరూ సలార్ విషయాలు బయటపెట్టడం లేదు. రిలీజ్ కి రెండు నెలల ముందు నుండే షారుఖ్ జవాన్ ప్రమోషన్స్ తో ఆరగొట్టేస్తున్నారు. కానీ సలార్ ట్రైలర్ ఎప్పుడనే విషయం కూడా మేకర్స్ తేల్చకుండా ఉండేసరికి ఫాన్స్ లో చిరాకు మొదలైంది.

KGF అప్పుడు తెగ ప్రమోట్ చేసారు, సలార్ కొచ్చేసరికి ఆ ప్రమోషన్స్ ఎందుకు మొదలు పెట్టరంటూ యద్ధానికి దిగుతున్నారు. మరి సలార్ పై సాలిడ్ అప్ డేట్ ఏదైనా వస్తే ఓకే లేదంటే ప్రభాస్ ఫాన్స్ ఊరుకోరు. 

Salaar update

salaar