రూ.100 కోట్ల హీరో నెక్స్ట్ దర్శకుడెవరో?

Who will direct Akhil NextWho will direct Akhil Next


అఖిల్ అక్కినేని తన పదేళ్ల కెరీర్ లో మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా అడుగుపెట్టారు. లెనిన్ చిత్రంతో అఖిల్ ఈ రేర్ ఫీట్ ని అందుకున్నారు. పదేళ్లకు అఖిల్ ని విజయం వరించింది. దానితో అక్కినేని ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ మోడ్ లో సంబరాలు చేసుకుంటుంది. అంతకుమించి అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక అఖిల్ లెనిన్ విజయంతో రిలాక్స్ అవ్వలేని పరిస్థితి. నిన్నటివరకు అఖిల్ విజయం కోసం ఒత్తిడిని తీసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ విజయాన్ని కంటిన్యూ చెయ్యాలంటే తదుపరి చిత్రం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్లీ హిట్ ఇచ్చే దర్శకుడిని వెతకాలి. ఆ కథ కోసం మేకోవర్ అవ్వాలి.

దాని కోసం అఖిల్ రెడీ అవ్వాలి. నెక్స్ట్ సినిమా ప్లానింగ్ మొదలవ్వాలి. అక్కడే అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది. అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు, ఈ రూ.100 కోట్ల హీరోని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడనే విషయంలో ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా కామన్ ఆడియన్స్ క్యూరియాసిటీ చూపిస్తున్నారు. 

Who will direct 100 Crs Hero next