ఆగష్టు వచ్చేసింది-విశ్వంభర ఎక్కడా?

Whats Happening with VishwambharaWhats Happening with Vishwambhara


ఆగష్టు వచ్చేసింది. మెగా బాస్ బర్త్ డే మంత్ ఆగష్టు. కానీ మెగాస్టార్ నటించిన విశ్వంభర జాడ లేదు. ఈ మంత్ లో అయినా దర్శకుడు వసిష్ఠ విశ్వంభర అప్ డేట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ లో ఎక్కడో ఓ చిన్న హోప్. కానీ ఆగస్టు వచ్చేసినా విశ్వంభర విషయమై ఎలాంటి క్లూ కూడా వారికీ దొరకడం లేదు.

మరి ఆగష్టు మంత్ వస్తే ఏమిటి.. మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు 22 న విశ్వంభర నుంచి ట్రీట్ ఏమైనా వసిష్ఠ సిద్ధం చేస్తున్నాడేమో అందుకే కామ్ గా ఉన్నాడనే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా చిరు బర్త్ డే కి విశ్వంభర విషయం ఏదో ఒకటి తేల్చేస్తారు మేకర్స్. ఇదైతే పక్కా. కానీ అప్పటివరకు మెగా ఫ్యాన్స్ ని మభ్యపెట్టడం ఎందుకు.

అదేదో చిన్న అప్ డేట్ తో వారిని కూల్ చెయ్యొచ్చు కదా. మెగాస్టార్ బర్త్ డే కి విశ్వంభర రిలీజ్ డేట్ తో పై పాటుగా ట్రైలర్ కూడా వదిలే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి అప్పటికైనా విశ్వంభర విషయం ఖచ్చితంగా తెలుస్తారో లేదంటే సస్పెన్స్ కంటిన్యూ చేస్తారో చూద్దాం. 

No Clarity On Vishwambhara