నటనకు బ్రేక్ - ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీ
Samantha Busy As producer
సమంత ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ తీసుకోబోతుంది. ఆమె ప్రెగ్నెంట్. బిడ్డ పుట్టేవరకు సమంత నటనకు బ్రేక్ ఇవ్వబోతుంది. అయితే బిడ్డ పుట్టాక సమంత నటిస్తుందా, లేదంటే నటనకు ఫుల్ టైం బ్రేక్ ఇస్తుందా అనేది సస్పెన్స్ గా మారిన సమయంలో ఆమె మా ఇంటి బంగారం చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసింది.
దానితో సమంత మెటర్నిటీ లీవ్ తర్వాత మా ఇంటి బంగారం సీక్వెల్ చేస్తుంది. అయితే ఇకపై సమంత ఫుల్ టైమ్ నిర్మాతగా మారాలనుకున్నట్టుగా తెలుస్తుంది. నిర్మాతగా చిన్న సినిమాలను, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ని సమంత నిర్మిస్తుంది అని తెలుస్తుంది
ఇప్పటికే శుభం, మా ఇంటి బంగారం చిత్రాలతో నిర్మాతగా సక్సెస్ అయిన సమంత ఇకపై ఆ దిశగానే తన అడుగులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. రెండేళ్ల క్రితమే నటనకు ఫుల్ స్టాప్ పెడదామనుకున్న సమంత కు ఆమె భర్త రాజ్ నిడిమోరు దిశానిర్దేశం చెయ్యడం వల్లే ఆమె మళ్లీ నటిస్తున్నట్టుగా ఈమధ్యనే మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో చెప్పారు.







































