మారుతి క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందంటగా
Director Maruthi Signed Crazy project
ది రాజాసాబ్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి అజ్ఞాతంలోకి వెళ్లిన దర్శకుడు మారుతి సైలెంట్ గా తన తదుపరి చిత్రం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. శ్రీరామ నవమి కె తన కొత్త స్రిప్ట్ రెడీ అంటూ తానే ఓన్ గా ఓ అప్ డేట్ ఇచ్చారు. ఆతర్వాత కామ్ గా ఉన్నారు. ఆయన తన కథ తో ఏ హీరోని మెప్పిస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
తాజాగా మారుతి క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అంటూ సదరు జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసారు. మారుతి రాజసాబ్ ని ప్రభాస్ తో చేస్తున్నప్పుడు ఈ జర్నలిస్ట్ ఫ్రెండ్ రాజసాబ్ అప్ డేట్స్ ని అభిమానులకు చేరవేసేవారు. ఇప్పుడు మారుతి తదుపరి ప్రాజెక్ట్ విషయంలోనూ ఆయన తన జర్నలిస్ట్ ఫ్రెండ్ నే నమ్ముకున్నట్టుగా ఉన్నారు.
మారుతి ఆ క్రేజీ ప్రోజెక్ట్ హీరో ఎవరు? ఏ హీరోతో తన తదుపరి సినిమాని స్టార్ట్ చేస్తారో అనే క్యూరియాసిటీ మాత్రం అందరిలో కనిపిస్తుంది.
Maruthi Signed Crazy project







































